ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు !

-

నదిలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే.. ఆ ప్రేమజంటను కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టాడు మత్స్యకారుడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ వింత సంఘటన జరిగింది.

A fisherman tried to commit suiide by jumping into the river

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్‌పూర్‌లో ఓ ప్రేమ జంట గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.. అది చూసి అక్కడే ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై వారిని కాపాడారు.

వారిని ఒడ్డుకు తీసుకువచ్చాక ప్రియుడిని పనికిమాలిన పని చేశావని ఓ మత్స్యకారుడు చెంప పగలకొట్టాడు. అనంతరం వారిపై పోలీసులకు సమాచారం అందించాడు సదరు మత్స్యకారుడు. ఇక దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news