అమెరికా ఆదాయంలో 6శాతం వాటా భారత సంతతిదే

-

అమెరికా జనాభాలో 1.5 శాతమే ఉన్న భారత సంతతివారి వల్ల ఆ దేశ ఆర్థికానికి మేలు జరుగుతుందని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అధ్యయనం తేల్చింది. భారతీయ సంతతి నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. మొత్తం ఆదాయ పన్నులో భారతీయ అమెరికన్ల నుంచి సుమారు 5-6 శాతం వస్తోందని తెలిపింది.

2023 నాటికి భారతీయ అమెరికన్ల జనాభా సుమారు 50లక్షలు అంటే అమెరికా జనాభాలో 1.5 శాతానికి చేరిందని ఈ అధ్యయనం పేర్కొంది. వారి నుంచి ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయ పన్నులో 5-6 శాతం లభిస్తోందని.. దాదాపు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల డాలర్లకు సమానం అవుతుందని వెల్లడించింది. భారతీయ అమెరికన్ల వృత్తుల వల్ల అమెరికాలో కోటీ పది లక్షల నుంచి కోటీ ఇరవై లక్షల మందికి పరోక్ష ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పింది. ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో 16 సంస్థలకు భారతీయ అమెరికాన్ల వారే ప్రధాన కార్యనిర్వహణాధికారులుగా ఉన్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news