గత కొద్ది రోజులుగా టమాటాల ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు రూ.10 ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.250 దాటింది. చాలా ప్రాంతాల్లో కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 మధ్య ఉంది. అయితే సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ఈ టమాట ధరలపై సోషల్ మీడియాలో తెగ మీమ్స్ వస్తున్నాయి.
ఇక ప్రస్తుతం కేజీ టమాటా ధరా సగటున రూ.100-150 వరకు పలుకుతోంది. రాబోయే రోజుల్లో వీటి ధర దేశవ్యాప్తంగా ఆల్ టైం హై రూ. 300కు చేరే అవకాశం ఉందని నేషనల్ కమోడిటీస్ మేనేజ్మెంట్ సర్వీస్ CEO సంజయ్ గుప్తా అంచనా వేశారు. వర్షాల వల్ల దిగుబడి మరింత తగ్గడంతో ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. కాగా, చండీగఢ్ మార్కెట్లలో ఇప్పటికే ధరలు రూ. 200-250 పలుకుతున్నాయి. రిటైల్ దుకాణాల్లో ఏకంగా రూ. 300-400 కు విక్రయిస్తున్నారు.