హర్యానా ఎన్నికల ఫలితాలలో ట్విస్ట్ నెలకొంది. ఇవాళ ఉదయం నుంచి హర్యానా ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఆదిత్యాన్ని ప్రదర్శించింది. అయితే 10 గంటల సమయానికి.. కాంగ్రెస్ ఆదిక్యం తగ్గిపోయి బిజెపి లీడింగ్ లోకి రావడం జరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హర్యానా రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ 33 స్థానాలకు పడిపోయింది.
అటు భారతీయ జనతా పార్టీ 49 స్థానాలతో మళ్ళీ లీడింగ్ లోకి దూసుకు వెళ్లింది. ఇతరులకు 8 స్థానాలు వచ్చేలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవే లెక్కలు కొనసాగితే కచ్చితంగా మరోసారి… హర్యానాలో బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే మరో రెండు గంటల్లో.. కాంగ్రెస్ గనక పుంజుకోకపోతే బిజెపి.. ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అంటున్నారు.