వాహనదారులకు షాక్.. ఆ వాహనాలకు రూ.10వేల ఫైన్..!

-

వాహనదారులకు భారీ షాకింగ్ వార్త. రవాణా వాహనాల యజమానులు, డ్రైవర్లకు ఇక నుంచి ఆ సర్టిఫికేట్ లేకుండా వాహనాలు నడిపితే రూ. 10,000 ఫైన్ జరిమానా విధించడం జరుగుతుందంట. దేశంలో రోజురోజుకు వాహనాల కాలుష్యం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి పూణేకు చెందిన అధికారులు సరి కొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ బంకులకు వెళ్లే వాహనదారులకు బిగ్ షాక్ తగలబోతోంది. మీ వాహనానికి సంబంధించిన ఆ ఒక్కటి లేకపోతే జేబుకి చిల్లుపడ్డట్టే.

ముఖ్యంగా పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కే వాహనాలకు రూ.10 వేలు జరిమానా విధించేలా పెట్రోల్ పంపుల వద్ద అధునాతన కెమెరాలను ఉపయోగించి ఆటోమేటెడ్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇకపై పొల్యూషన్ సర్టిఫికెట్ లేని కార్లు రిజిస్ట్రేషన్ నుంచి బ్లాక్ లిస్ట్ చేయబడతాయి. పెట్రోల్ బంకుల వద్ద ఆధునిక కెమెరాలతో వాహనాల నంబర్ ప్లేట్లను పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని గుర్తించినప్పుడు యజమాని మొబైల్కు SMS రూపంలో జరిమానా వివరాలు పంపిస్తారు. ఈ సర్టిఫికేట్ లేకుండా వాహనాలు నడిపితే ఫైన్ తప్పకుండా చెల్లించాల్సిందే. లేకపోతే కఠిన చర్యలు తప్పవు అంటున్నారు. త్వరలోనే ఈ సిస్టమ్ను అభివృద్ధి చేయనున్నారు. ఇక త్వరలోనే ఈ సిస్టమ్ అందుబాటులోకి రావొచ్చని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news