క్యాన్సర్ ఒకప్పుడు అరుదైన వ్యాధిగా ఉండేది. కానీ ఇప్పుడు అనాధి వ్యాధిగా తయరైంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే.. ఇక ఆయుష్షును లెక్కేసుకోవడమే.. బతికినంత కాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో 20 శాతం క్యాన్సర్ కేసులు 40 ఏళ్లలోపు పురుషులు మరియు స్త్రీలలో సంభవిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఢిల్లీకి చెందిన క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ నివేదికను విడుదల చేసింది.
నివేదిక ప్రకారం.. క్యాన్సర్ ముక్త్ భారత్ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ మరియు సీనియర్ ఆంకాలజిస్ట్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ యువతలో క్యాన్సర్ కేసులు పెరగడం వెనుక పేద జీవనశైలి ఉందని అన్నారు. ఊబకాయం, ఆహారపు అలవాట్లలో మార్పు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం మరియు నిశ్చల జీవనశైలి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ప్రమాద కారకాలని ఆశిష్ గుప్తా చెప్పారు. యువ తరంలో క్యాన్సర్ ముప్పు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండాలని అంటున్నారు.
అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో కనుగొనబడిన కేసులలో 27 శాతం క్యాన్సర్ మొదటి మరియు రెండవ దశలలో ఉన్నాయి మరియు 63 శాతం మూడవ మరియు నాల్గవ దశలలో ఉన్నాయి. మార్చి 1 మరియు మే 15 మధ్య ఫౌండేషన్ యొక్క క్యాన్సర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసిన భారతదేశంలోని 1,368 మంది క్యాన్సర్ రోగులపై ఈ అధ్యయనం నిర్వహించబడింది.
క్యాన్సర్ ప్రమాదం పురుషులకు ఎంత ఉందో.. మహిళలకు కూడా అంతే ఉంది. బ్లడ్ క్యాన్సర్ వచ్చ ప్రమాదం మహిళలకు ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. అందుకే వాటిని ముందే గుర్తించడం చాలా కష్టం. దానివల్లే అది సివియర్ స్టేజ్‌కు చేరిన తర్వాత ప్రజలకు చికిత్స మొదలుపెడుతుంటారు. ఎలాంటి అసాధారణమైన లక్షణం మీలో గుర్తించినా వాటిని లైట్ తీసుకోకుండా వైద్యులను సంప్రదించండి.