హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్‌ దాడిలో టాప్‌ కమాండర్‌ హతం

-

హమాస్‌ సమూల నాశనమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకు పడుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ గాజాలోని ఒక భూగర్భ సొరంగంలో దాక్కున్న ఇస్సా లక్ష్యంగా మార్చి 11న ఎయిర్‌ స్ట్రైక్‌ చేశాయి. ఈ దాడుల్లో హమాస్‌ నంబర్‌ 3 కమాండర్‌ మార్వాన్‌ ఇస్సా హతమయ్యాడని అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జేక్‌ సలివన్‌ ప్రకటించారు. హమాస్‌ మిలిటరీ డిప్యూటీ కమాండర్‌ అయిన ఇస్సా సెంట్రల్‌ గాజాలో జరిపిన ఇజ్రాయెల్‌ జరిపిన ఎయిర్‌స్ట్రైక్‌లో మరణించినట్లు పేర్కొన్నారు.

సెంట్రల్‌ గాజాలోని ఒక భూగర్భ సొరంగంలో దాక్కున్న ఇస్సా లక్ష్యంగా మార్చి 11న ఎయిర్‌ స్ట్రైక్‌ చేసినట్లు ఇజ్రాయెల్‌ దళాలు పేర్కొన్నాయి. ఈ దాడుల్లో మృతిచెందింది ఇస్సానా? కాదా? అనే వివరాలు తెలియాల్సి ఉందని ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి రేర్‌ అడ్మిరల్‌ డానియేల్‌ హగరీ అన్నారు. ఈ దాడికి సంబంధించి ఇంకా పరిశోధిస్తున్నట్లు, పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు. మరోవైపు అతడు మృతి చెందినట్లు అమెరికా ప్రకటించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news