యూట్యూబ్ చూసి గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్నా.. సంచలన విషయాలు వెల్లడించిన నటి రన్యారావు

-

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ నటి  రన్యారావు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్టు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. 

దుబాయ్ నుంచి ఇంతకు ముందు ఎన్నడూ కూడా బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదని తెలిపింది. స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి సారి వెల్లడించింది. ఎవ్వరికీ కనపించకుండా బంగారాన్ని ఎలా దాచాలనే విషయాన్ని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నట్టు వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు రన్యారావు పెళ్లి సమయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కనిపించడం ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్న విషయం తెలిసిందే. రన్యా రావు కేసులో అధికారులు ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version