అంబానీ ని దాటేసిన అదానీ.. ఆసియా లో నెంబ‌ర్ వ‌న్

అత్యంత ధ‌న‌వంతుడి జాబితా లో అదానీ గ్రూప్ ఆఫ్ చైర్మెన్ గౌత‌మ్ అదానీ దూసుకు పోయాడు. ఆసియా లో నే అత్య‌ధిక సంప‌ద క‌లిగిన వ్య‌క్తి గా గౌత‌మ్ అదానీ మొద‌టి సారి నిలిచాడు. ఈ స్థానం లో ఇప్ప‌టి వ‌ర‌కు రిలయ‌న్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ ఉన్నాడు. తాజాగా ఆయ‌న ను వెన‌క్కి నెట్టి అదానీ ఆసియా లో నే నెంబ‌ర్ వ‌న్ స్థానం లో కి దూసుకు వెళ్లాడు.\

అదాని అతి త‌క్కువ కాలం లో నే ఎక్కువ శాతం సంపాదించి ఆసియా లో నే అత్యంత ధ‌న‌వంతుడి జాబితా లో మొద‌టి స్థానం లో నిలిచాడు. అదానీ ఆస్తుల విలువ‌ 2020 లో 4.91 బిలియ‌న్ డాలర్లు గా ఉండేది. కాని చాలా త‌క్కువ కాలం లో అంటే కేవ‌లం 20 నెల ల్లో నే అదానీ ఆస్తుల విలువ 88.89 బిలియ‌న్ డాల‌ర్ల్ కు చేరింది. అంటే దాదాపు ఈ 20 నెల‌ల కాలంలో దాదాపు 1808 శాతం అదాని ఆస్తుల విలువ పెరిగింది. దీంతో అదానీ గ్రూప్ ఆఫ్ చైర్మెన్ గౌతమ్ అదానీ ఆసియా లో నే అత్యంత ధ‌న‌వంతుల జాబితా లో నెంబ‌ర్ వ‌న్ స్థానం లో కి ఎగ‌బాకాడు.