నా నియోజకవర్గం రోడ్లు ఆ హీరోయిన్ బుగ్గల్లా ఉండాలి… రాజస్థాన్ మంత్రి కామెంట్స్..

రాజస్థాన్ మంత్రి వర్గంలో కొత్తగా పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర గూడా అప్పుడే వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో 15 మంది కొత్తవాళ్లకు మంత్రులుగా పదవులు లభించాయి. ఈ నేపథ్యంలోనే ఉదయ పూర్వాటి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న రాజేంద్రకు కూడా మంత్రి వర్గంలో చోటు లభించింది. మంత్రి అయిన తర్వాత తొలిసారిగా తన నియోజకవర్గానికి వచ్చిన గజేంద్ర క్రేజీ కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కారు. గ్రామాల్లో రోడ్లను బాగు చేయాలని పలువురు ప్రజలు కోరడంతో సదురు మంత్రి… తన నియోజకవర్గంలోని రోడ్లు బాలీవుడ్ హీరోయిన్ ’’కత్రినా కైఫ్‘‘ బుగ్గల్లా ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యల వివాదాస్పదం కావడంతో సోషల్ మీడియాలో సదరు మంత్రిపై విమర్శలు వస్తున్నాయి.

గతంలో కూడా పలువురు రాజకీయ నాయకులు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. బీహార్ లో రోడ్లు హేమామాలిని బుగ్గల్లా నున్నగా ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు.