ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త..వారందరికీ ఎలక్ట్రిక్ వాహనాలు

మన దేశంలో పెట్రోల్‌, డిజీల్‌ ధరలు విపరీతంగా పెరిగి పోతున్న సంగతి తెలిసిందే. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి ఏకంగా లీటర్‌ పెట్రోల్‌ పై రూ. 50 లకు పైగా ధరలు పెరిగి పోయాయి. అటు డిజీల్‌ ధరలు కూడా ఇదే స్థాయి లో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది వాహన దారులు… చమురుతో నడిచే వాహనాలను పక్కకు పెట్టి… ఎలక్ట్రికల్‌   వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

kcr
kcr

ఇలాంటి తరుణంలో.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు… కేసీఆర్‌ సర్కార్‌ ఓ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష మంది ఉద్యోగులకు మొదటి విడత లో ఎలక్ట్రికల్‌ వాహనాలను ఈఎంఐ సౌకర్యంతో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే…. ఆ ఎలక్ట్రికల్‌ వాహనాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం గైడ్‌ లైన్స్‌ ప్రకారమే… తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.