ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అద్వానీ డిశ్చార్జీ..!

-

బీజేపీ జాతీయ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్.కే.అద్వానీ (96) అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్ మెంట్ అందించారు. తాజాగా  ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ  తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

ఎయిమ్స్ యూరాలజీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జి చేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. కాగా అద్వానీ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలతో ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రార్థనలు చేశారు. దేశంలో అపర చాణక్యుడు, మాజీ ఉప ప్రధాని అనారోగ్యానికి గురయ్యారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అలాగే పలువురు బీజేపీ జాతీయ, రాష్ట్రాల నేతలు కూడా అధ్వాని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డిశ్చార్జి కావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news