ఓమ్నీ వ్యాన్ నడిపిన మాజీ సీఎం కేసీఆర్..!

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ఏడాది తన ఫామ్ హౌస్ లో జారిపడ్డ విషయం తెలిసిందే. దీంతో వెంటనే కేసీఆర్ ని హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. తుంటి ఎముక ఫ్యాక్చర్ అయ్యిందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. అనంతరం కేసీఆర్ వాకర్ సహాయంతో మెల్లమెల్లగా అడుగులు వేశారు.

అయితే తుంటి గాయం నుంచి కోలుకుంటోన్న కేసీఆర్ ని మాన్యువల్ గా కారు నడపమని వైద్యులు సూచించారు. దీంతో కేసీఆర్ తన ఓమ్నీ వ్యాన్ ను నడిపినట్లు సమాచారం. కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపిన పాత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపిన ఫొటోలు తాజావా, గతంలోవా? అన్న క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారాయి. కేసీఆర్ వాహనం నడుపుతోన్న ఈ ఫొటోలు వీక్షించిన పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు “కేసీఆర్ సారు మళ్లీ కారు నడపడం స్టార్ట్ చేశారు” అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news