రన్ వే అవసరం లేకుండా నిటారుగా టేకాప్, ల్యాండ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ లు దేశంలోకి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే ఇవి అందుబాటులోకి వచ్చాయి. విద్యుత్ విమాన అంకుర పరిశ్రమ ఇప్లేన్ వీటిని తయారు చేయనుంది. తాజాగా దీనికోసం రూ.100 కోట్ల డాలర్ల విలువై ఒప్పందం పై సంతకం చేసింది భారత్ లో ఎయిర్ అంబులెన్స్ సేవలందించే సంస్థ ఐసీఏటీీ.
తాజాగా ఇప్లేన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద 788 ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఎయిర్ అంబులెన్సులను సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటిని దేశంలోని ప్రతీ జిల్లాలో అందుబాటులో ఉంచాలని కంపెనీ భావిస్తోంది. 2026 చివరి త్రైమాసికం నాటికి ఎయిర్ అంబులెన్సులను సరఫరా చేయాలని ఇప్లేన్ సంస్థ భావిస్తోంది. వేర్వేరు భౌగోళిక, జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లో స్తానిక అవసరాలకు అనుగుణంగా మూడు రకాల ప్రోటో టైప్ లను ఇప్లేన్ రూపొందిస్తోంది. ఈ ఎయిర్ అంబులెన్స్ లో ఒక పైలట్, పారామెడిక్, పేషెంట్, స్టెచర్, అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి.