‘ఇండియా’ కూటమిలో కలకలం.. అలా చేస్తే బయటకెళ్తామని అఖిలేశ్​ వార్నింగ్​

-

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఎలాగైనా గద్దె దించాలనే లక్ష్యంతో విపక్షాలన్నీ ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ ఎంతో ఐకమత్యంతో మెలిగి.. సామరస్యంగా చర్చలు జరిపిన ఈ కూటమిలో ఇప్పుడు లుకలుకలు మొదలవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కూటమిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ లుకలుకలు నిజమేనని అనిపిస్తున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఇటీవలే మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి కాంగ్రెస్‌.. ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఈ విషయంపై ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అసహనం వ్యక్తం చేస్తూ… తమకు మధ్యప్రదేశ్‌లో ఎదురైన పరిస్థితే ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎదురవుతుందని అన్నారు.

ఇండియా కూటమి కేవలం పార్లమెంటు సీట్ల కోసం పరిమితమైందని తెలిసి ఉంటే.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఆహ్వానించిన సమావేశానికి తాము వెళ్లేవారం కాదని అఖిలేశ్ పేర్కొన్నారు. ఈ సంగతి ముందే తెలుసుంటే అసలు వారి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోయేవాళ్లమని తెలిపారు. ఆ సమావేశంలో 6 సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇలానే ప్రవర్తిస్తే కూటమి నుంచి బయటకు వెళ్లిపోతామని అఖిలేశ్ హెచ్చరించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news