ఇషా ఫౌండేషన్ లో సభ్యులుగా పనిచేసిన నరేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇషా ఫౌండేషన్ లో బాలబాలికలపై లైంగిక వేదింపులు జరుగుతున్నాయని బాంబ్ పేల్చారు. గత జూన్ 21 న కూడా కొందరు అమ్మాయిలపై లైంగిక వేదింపులు జరిగాయని వెల్లడించారు. నేను నా భార్య ఇషా ఫౌండేషన్ లో వాలంటీర్లు గా ఏళ్లుగా పనిచేస్తున్నామన్నారు.
మేము అక్కడ భక్తి తో దాదాపుగా 12 ఏళ్లుగా పనిచేసామని తెలిపారు. మా బాబు పైన కూడా లైంగిక వేదింపులు జరిగాయని తెలిపారు. మాలాంటి బాధితులు కూడా ఉన్నారన్నారు. పెద్ద మనుషులు కావడంతో ఎవ్వరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇషా ఫౌండేషన్ లో సభ్యులుగా పనిచేసిన నరేందర్. మా బాబు పై ఏళ్ల పాటు లైంగిక వేదింపులకు గురయ్యాడు..కొవిడ్ సమయంలో మా బాబు బిహేవియర్ లో మార్పు రావడం… మేము బుక్స్ వెతికితే… అందులో రాసుకున్నాడని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.