వైసీపీ కోసం బాగా పనిచేసే వారికీ రేటింగ్స్ ఇస్తా – వైఎస్ జగన్

-

వైసీపీ కోసం బాగా పనిచేసే వారికీ రేటింగ్స్ ఇస్తా అంటూ వైఎస్ జగన్ ప్రకటించారు. అమరావతిలో వైసీపీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు వైఎస్ జగన్‌ దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో కూడా నిర్మాణాత్మకంగా ఉండాలని కోరారు జగన్‌.

పనితీరుపై పరిశీలన, మానిటరింగ్‌ ఉంటుందని… సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండాలని ఆదేశించారు వైఎస్ జగన్. జిల్లా అధ్యక్షుల పనితీరు ఆధారంగా ప్రమోషన్లు ఉంటాయని… దేశంలో అత్యంత బలమైన పార్టీగా వైసీపీని తయారు చేయాలని స్పష్టం చేశారు జగన్‌. బాగా పనిచేసేవారికీ రేటింగ్స్ ఇస్తామన్నారు వైఎస్ జగన్. రిపోర్టుల ప్రకారం నిర్ణయాలు కూడా ఉంటాయని… మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని కూడా చెప్పుకొచ్చారు వైఎస్ జగన్.

Read more RELATED
Recommended to you

Latest news