దేశవ్యాప్తంగా యూరియాను భారత్ యూరియా అనే నామరణంతో అన్ని కంపెనీలు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.దీని కోసం ఆయా కంపెనీల ప్రతినిధుల త్వరలో ఢిల్లీలో సమావేశం నిర్వహించనుంది. ఈ పేరుతో పాటు కేంద్రం ఇస్తున్న రాయితీ, ఒక ట్యాగ్ పై బార్ కోడ్‌ను కంపెనీలు ముద్రించాలి. డీలర్ల వద్ద ఉన్న ఈ పాస్ యంత్రాలకు, డీబీటీ సిస్టమ్‌తో బార్‌కోడ్ రీడింగ్ మిషన్లను అధికారులు అనుసంధానిస్తారు.
ఈ బార్‌కోడ్‌ను గుర్తించి యూరియా రైతులకు అమ్మిన తరువాతనే రాయితీ సొమ్మును కంపెనీలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎరువుల నియంత్రణ చట్టంలోని 21 క్లాజ్‌కి లోబడి వినియోగదారులకు అవసరమైన వివరాలను ఎరువులోని పోషకాల స్థాయిని బస్తాపై తప్పనిసరిగా ముద్రించాలి. తొలిగా ప్రధానమంత్రి భారతీయ జన యూరియా పరియోజన పథకం కింద యూరియాను ఎంపిక చేసింది. పది రకాల సవరణలను ఈ ఎరువు సరఫరాకు వర్తింపజేసి సరైన ఫలితాలు వచ్చాక ఇతర కాంప్లెక్స్ ఎరువులక ఒకే దేశం ఒకే ఎరువు పేరుతో పలు సంస్కరణలు తేవాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.