BREAKING : తీర్థయాత్రకు వెళ్తుండగా ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

-

హర్యానాలోని అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి ఓ కుటుంబం తమ బంధువులతో కలిసి మినీ బస్సులో బయల్దేరింది. ఆ బస్సు అంబాలా- దిల్లీ-జమ్ము జాతీయ రహదారి వద్దకు రాగానే ట్రక్కను ఢీ కొట్టింది. ఈ ఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబాలా కాంటోన్మెంట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అతివేగంగా వచ్చి ట్రక్కును ఢీ కొట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అతివేగమో లేదా నిద్రమత్తులో డ్రైవ్ చేయడం వల్లో ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news