రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలడానికి నిమిషన్నర ముందు ఏం జరిగిందంటే?

-

ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంపై ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికను ఉటంకిస్తూ తస్నిమ్ వార్తా సంస్థ ఓ కథనం రాసింది. ఈ నివేదిక ప్రకారం.. హెలికాప్టర్ ముందు నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించింది. ఎక్కడా నిర్దేశిత మార్గాన్ని దాటి వెళ్లలేదు.

అయితే ప్రమాదం సంభవించడానికి దాదాపు నిమిషన్నర ముందు కూలిన హెలికాప్టర్‌ పైలట్…. కాన్వాయ్‌లోని ఇతర రెండు హెలికాప్టర్లను సంప్రదించినట్లు ఈ నివేదిక పేర్కొంది. అయితే హెలికాప్టర్‌ సిబ్బంది, వాచ్‌టవర్‌ మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఎలాంటి అనుమానాస్పద సంభాషణలను గుర్తించలేదని తెలిపింది. మరోవైపు శకలాల్లో బుల్లెట్లు లేదా ఇతర పేలుడుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని.. కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్‌లో మంటలు చెలరేగాయని నివేదిక వెల్లడించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news