సెప్టెంబర్​లో భారత పర్యటనకు అమెరికా అధ్యక్షుడు

-

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ త్వరలోనే భారత్​లో పర్యటించనున్నారు. దిల్లీ వేదికగా సెప్టెంబర్ 7నుంచి 10 వరకు జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సులో బైడెన్ పాల్గొంటారు. వాతావరణ మార్పులు, రష్యా-ఉక్రెయిన్ వివాదం సహా అనేక ప్రపంచ సమస్యలపై ఇతర దేశాల అధినేతలతో ఈ సందర్భంగా ఆయన చర్చించనున్నారని సమాచారం. బైడెన్ పర్యటన వివరాలను శ్వేతసౌధం వెల్లడించింది.

జీ20కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న తీరును అధ్యక్షుడు బైడెన్ ప్రశంసించారని శ్వేతసౌధం తన ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సహకారానికి పాటుపడే జీ20 కూటమికి మేం కట్టుబడి ఉన్నాం. 2026లో ఈ కూటమికి నాయకత్వం వహించడానికి అమెరికా ఎదురుచూస్తోంది. అని ప్రకటనలో వైట్ హౌజ్ తెలిపింది.

జీ-20 ప్రపంచ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి 29 దేశాల అధినేతలతో పాటు ఐరోపా సమాఖ్య, ఆహ్వానిత అతిథి దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news