చిరంజీవి ఒక్కో సినిమాకి తీసుకొనే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

-

మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన క్రేజ్, స్టార్డం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిన్న ఆయన పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించారు. సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరుగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉండగా వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్ తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ లుక్ లో కనిపించి అందరిని అలరించారు. అయితే ఆ తర్వాత ఆయన నటించిన భోళా శంకర్ మాత్రం పూర్తిగా డిజాస్టర్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు నెట్టింట చిరు రెమ్యునరేషన్ మాత్రం వైరల్ గా మారుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో అదరగొడుతున్న చిరంజీవి పారితోషికం విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ .63 నుంచి రూ.65 కోట్ల వరకు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన భోళా శంకర్ సినిమా కోసం ఆయన దాదాపు రూ.60 కోట్లు తీసుకున్నారని అంతకుముందు ఒక్కో సినిమాకు రూ.35 నుంచి రూ.50 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నారని సమాచారం.

అయితే గాడ్ ఫాదర్ సినిమా కోసం మాత్రం ఏకంగా రూ.45 కోట్ల పారితోషకం తీసుకున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పారితోషకం పెంచేసారని సమాచారం. ఇక తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్, సంయుక్త జంటగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా తన రెండవ సినిమాను చిరంజీవితో చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news