మ‌హారాష్ట్రలో మ‌రో 6 ఓమిక్రాన్ కేసులు

మ‌హారాష్ట్రలో ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్ర‌తి రోజు కేసులు విప‌రీతంగా వ‌స్తున్నాయి. ఈ రోజు కూడా 6 ఓమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. ముంబై లోని ఎయిర్ పోర్ట్ లో 4 కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే పూణే లో ఒక‌టి, పింపిరి లో మ‌రొక‌టి మొత్తం 6 ఓమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇందులో ఒక్క‌రు క‌ర్నాట‌క‌, ఓరంగ‌బాద్ నుంచి వ‌చ్చిన ట్రావ‌ల్ హిస్ట‌రీ ఉంది. అలాగే మ‌రో ఇద్ద‌రికి టాంజానియా నుంచి వ‌చ్చిన వారిగా గుర్తించారు.

అలాగే మ‌రో ఇద్ద‌రు ఇంగ్లాండ్ నుంచి వ‌చ్చిన వారిగా అధికారులు గుర్తించారు. అయితే వారంద‌రూ కూడా క‌రోనా వ్యాక్సిన్ ల‌ను తీసుకున్న వారే అని తెలిపారు. అయితే ఈ 6 గురిని ముంబై లోని ఒక ఆస్ప‌త్రి లో ఐసోలేష‌న్ లో ఉంచారు. వీటితో మొత్తం 54 కేసులు న‌మోదు అయ్యాయి. దీనిలో ముంబైలోనే 22 కేసులు న‌మోదు అయ్యాయి. కాగ ఓమిక్రాన్ కేసులు ఈ మ‌ధ్య కాలంలో విప‌రీతం గా వ‌స్తున్నాయి. ఎక్కువ శాతం విదేశాల నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికులకే ఎక్కువ కేసులు న‌మోదు అవుతున్నాయి.