ఉద్ధవ్ థాక్రేకు మరో షాక్.. షిండే శిబిరంలోకి 66 మంది కార్పొరేటర్లు!

-

మహారాష్ట్రలో పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలిగిన శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ధానే మునిసిపల్ కార్పొరేషన్ టీఎంసీ లో 66 మంది పార్టీ కార్పొరేటర్లు షిండే క్యాంపులో చేరారు. 66 మంది రెబెల్ కార్పొరేటర్లు బుధవారం రాత్రి సీఎం షిండేను ఆయన నివాసంలో కలిశారు. శివసేన కార్పొరేటర్ల తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే టి.ఎం.సి పై పట్టు కోల్పోయారు.

మహారాష్ట్రలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తర్వాత టి.ఎం.సి అత్యంత ప్రతిష్టాత్మక నగరపాలక సంస్థ కావడం గమనార్హం. సీనియర్ నేత ఏక్నాధ్ షిండే తిరుగుబాటు నేపథ్యంలో ఉద్దవ్థాకరే రాజీనామా చేయడంతో జూన్ 29న మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే సీఎం పగ్గాలు చేపట్టగా బిజెపి పార్టీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news