కోవిడ్‌ టీకా రెండు డోసులను తీసుకోవాలా ? రెండో డోసు ఎప్పుడు తీసుకుంటే మంచిది ?

-

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఓ వైపు టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య రోజూ ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మూడో దశ టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలను ఇస్తున్నారు. అయితే కోవిడ్‌ టీకాలను రెండు డోసులూ తీసుకోవాలా ? తీసుకుంటే రెండో డోసును ఎప్పుడు తీసుకుంటే మంచిది ? అంటే..

are 2 doses of covid vaccine necessary how much gap required between 2 doses

మన దేశంలో కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ టీకాలను అందిస్తున్న విషయం విదితమే. అయితే ఈ రెండింటిలో ఏ వ్యాక్సిన్‌ తీసుకున్నా రెండు డోసులను కచ్చితంగా వేయించుకోవాలి. ఒక్క డోసు వేసుకుంటే కుదరదు. ఇమ్యూనిటీ లభించదు. రెండో డోసును తీసుకున్న కొద్ది వారాలకు యాంటీ బాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో కోవిడ్‌ నుంచి ఎక్కువ శాతం వరకు రక్షణ లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఏ వ్యాక్సిన్‌ తీసుకున్నా సరే.. రెండు డోసులను కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అయితే మొదటి డోసు తీసుకున్న 4 నుంచి 8 వారాల మధ్య రెండో డోసును తీసుకోవాలి. అదే కోవాగ్జిన్‌ అయితే మొదటి డోసు తరువాత 4 నుంచి 6 వారాలకు రెండో డోసును తీసుకోవచ్చు. ఇక రెండో డోసును తీసుకున్న తరువాత కూడా ఎప్పటిలా కోవిడ్ జాగ్రత్తలను పాటించాలి. ఎందుకంటే వ్యాక్సిన్లు ఏవీ 100 శాతం రక్షణను అందించవు. కనుక జాగ్రత్తగా ఉండాల్సిందే. మాస్కులను ధరించాలి, శానిటైజర్లను వాడాలి. సామాజిక దూరం పాటించాలి. అప్పుడే కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news