ప్రజ్వల్‌ రేవణ్ణపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ

-

మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం శనివారం వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కాకపోవటంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు.

మూడు వారాలుగా పరారీలో ఉన్న ప్రజ్వల్‌ జర్మనీ నుంచి లండన్‌కు రైల్లో వెళ్లాడని సిట్‌ ధ్రువీకరించింది. ఇప్పటికే పలుసార్లు భారత్‌కు టికెట్లు బుక్‌ చేసుకొని రద్దు చేసుకున్నట్లు గుర్తించిన సిట్..  కోర్టును ఆశ్రయించి అరెస్టు వారెంటును జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్‌పై ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయిన విషయం తెలిసిందే. ఆయన్ని మరింత కట్టడి చేసేందుకు బ్యాంక్‌ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ తండ్రి హెచ్‌.డి.రేవణ్ణ ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చారు. అంతకుముందు ఆయన ఏడు రోజులు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రజ్వల్‌పై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ శనివారం స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news