స్వాతి మాలీవాల్ దాడి ఘటన.. బిభవ్ కుమార్​ కు 5 రోజుల పోలీస్ కస్టడీ

-

ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు బిభవ్‌ కుమార్‌కు హజారీ కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. బిభవ్‌ కుమార్‌ తనపై దాడి చేశాడని స్వాతీ మాలీవాల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయన్ను శనివారమే అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు.. బిభవ్​ కుమార్​ను ఏడు రోజుల తమ కస్టడీకి అప్పగించాలంటూ  విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మే 23వ తేదీ వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు. ముందస్తు బెయిల్ కోసం బిభవ్​ కుమార్ పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు తిరస్కరించింది.

అసలేం జరిగిందంటే..  దిల్లీ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం మే 13వ తేదీన సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసానికి స్వాతి మాలీవాల్​ వెళ్లగా.. ఆ సమయంలో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని క్రూరంగా భౌతిక దాడికి పాల్పడినట్లు స్వాతి మాలీవాల్​ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన స్వాతి, 3 రోజుల తర్వాత ఫిర్యాదు చేశారు. ముందు చెంపపై కొట్టి, తర్వాత కాలితో తన్నాడని స్వాతి ఆరోపించారు.  మాలీవాల్​ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్లు 354, 506, 509, 323 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news