ఉదయపూర్ కన్హాయ్య లాల్ హంతకులపై కోర్టు ఆవరణలోనే దాడి!

రాజస్థాన్ లోని ఉదయపూర్ కు చెందిన టైలర్ కన్హాయ్య లాల్ తల నరికి దారుణంగా హత్య చేసిన హంతకులపై కోర్టు వద్ద జనం దాడి చేశారు. కన్హయ్య హత్య కేసులో నలుగురు నిందితులను జైపూర్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు భారీ భద్రత మధ్య ఉదయం హాజరుపరిచారు. ప్రధాన నిందితుడైన రియాజ్, గౌస్ మహమ్మద్ తో పాటు మరో ఇద్దరు నిందితులను అజ్మీర్ జైలు నుంచి తీసుకువచ్చారు. కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు నుండి నిందితులను బయటకు తీసుకు వెళుతుండగా జనం ఒక్కసారిగా దాడి చేసారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడి నుంచి వారిని తప్పించి పోలీసులు వ్యాన్లోకి ఎక్కించారు. మొహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శర్మ కు మద్దతుగా ఉదయపూర్ కు చెందిన 48 ఏళ్ల కన్నయ్య లాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి ప్రతీకారంగా రియాజ్ అక్తరీ, గోస్ మహమ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం దారుణంగా హత్య చేశారు. దీనిని రికార్డు చేసి వీడియోని విడుదల చేశారు. అంతేగాక ప్రధాని మోదీని కూడా బాధితులు బెదిరించారు. కాగా ఈ కేసులో నిందితులు నలుగురికి పది రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి ఎన్ఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది.