వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటులో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ కు చేరుకుంది. అందరూ ఊహించినట్టుగానే… సెమీ ఫైనల్ పోరులో బొక్క బోర్లా పడింది సౌత్ ఆఫ్రికా జట్టు. నిన్న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో… ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు పోరాడి గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు…. 49.4 ఓవర్లలో 212 పరుగులు చేసింది. అయితే లక్ష చేతనకు బరిలోకి దిగిన… ఆస్ట్రేలియా జట్టు చాలా కష్టపడి లక్ష్యాన్ని చేదించింది. 47.2 ఓవర్లలో… ఏడు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి విజయం సాధించింది ఆస్ట్రేలియా జట్టు. దీంతో నేరుగా ఫైనల్ చేరుకుంది ఆస్ట్రేలియా. ఇక ఆదివారం రోజున ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య ఫైనల్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.