అద్భుత ముహూర్తంలోనే ప్రాణప్రతిష్ఠ.. 25 సెకన్లలో రామ్ లల్లా విగ్రహంతో గర్భగుడికి మోదీ

-

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు వేళయింది. ఈ  నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ కోరారు. మకర సంక్రాంతి నుంచి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వరకు అన్ని దేవాలయాలను శుభ్రం చేయాలని చెప్పారు.

అయోధ్య రాముడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారని రాయ్ తెలిపారు. 84 సెకన్ల అద్భుత ముహూర్తంలోనే ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రధాని మోదీ సుమారు 300 మీటర్లు నడవనున్నట్లు వెల్లడించారు. పూజ మండపం నుంచి గర్భగుడికి 25 సెకన్లలోనే చేరుకోనున్నారని.. ఈ కార్యక్రమాన్ని కాశీకి చెందిన పండిత్ లక్ష్మీకాంత్ దీక్షిత్​ నేతృత్వంలో జరగనుందని పేర్కొన్నారు.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22 మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఉంటుందని రాయ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్​ఎస్​ఎస్​ సర్​ సంఘ్​చాలక్​ మోహన్ భాగవత్, ఉత్తర్​ప్రదేశ్ గవర్నర్​ ఆనందీబెన్​ పటేల్​, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సమక్షంలో ఈ కార్యక్రమం జరగుతుందని తెలిపారు. సుమారు 4,000 మంది సాధువులు ఇందులో పాల్గొంటారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news