అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్ల మంది హిందువల ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమైంది. రామమందిరంలో రంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ చారిత్రక ప్రాణప్రతిష్ఠ క్రతువులో ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం 12.289 గంటలకు అభిజిత్ లఘ్నంలో 84 సెకన్ల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సాగింది. ఈ ఘట్టాన్ని అయోధ్యలో ఉన్న వేల మంది, టీవీల్లో కోట్ల మంది శ్రీరామభక్తులు కనులారా వీక్షించారు. మనసారా ఆ బాలరాముడిని స్మరించుకున్నారు.
అయోధ్యలో కొలువైన బాలరామూని సుందరరూపం ప్రతి రామభక్తుని మనసు దోచేస్తోంది. ఈ సందర్భంగా రామ్ లల్లా స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో బాలరాముడు భక్తులకు కనువిందు చేశారు. చిరు దరహాసం, ప్రసన్న వదనంతో తన సేవలకు రామయ్య అభయహస్తం అందించారు. టీవీల్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చూసి భక్త కోటి పులకించిపోయింది. అయోధ్య రామ్లల్లా అపురూప విగ్రహం ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.