500 ఏళ్ల నిరీక్షణకు తెర.. అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

-

శ్రీరామజన్మభూమి అయోధ్యలో చారిత్రక ఘట్ట ఆవిష్కృతమైంది. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రంగరంగ వైభవంగా సాగింది. దిల్లీ నుంచి అయోధ్య చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరిగ్గా మధ్యాహ్నం 12.20 గంటలకు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రారంభమైంది. సంప్రదాయ దుస్తులతో శ్రీరాముని భవ్యమందిరానికి చేరుకున్న మోదీ రాముడికి ప్రత్యేక వస్త్రాలను తీసుకుని వచ్చి పండితులకు సమర్పించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యాజమాన్‌గా మోదీ వ్యవహరించిగా.. మోదీ సమక్షంలో ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు.

అయోధ్యలో ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమైంది. 12.29 గం.కు అభిజిత్ లగ్నంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ వైభవంగా జరిగింది. 84 సెకన్లపాటు రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రాణప్రతిష్ఠలో ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘ్ చాలక్‌ మోహన్ భగవత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం బాలరాముడికి ప్రధాని మోదీ హారతిచ్చారు. ఈ సమయంలో గగనవీధుల్లో పూలవర్షం కురిసింది. వాయుసేన హెలికాప్టర్ల ద్వారా అయోధ్య రామాలయంపై పూలవర్షం కురిసింది.

Read more RELATED
Recommended to you

Latest news