మణిపూర్ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో మరోసారి అశాంతి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో అల్లర్లను కంట్రోల్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ పై నిషేధాన్ని విధించగా.. తాజాగా దానిని ఎత్తివేసింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఐపీతోనే సేవలు పొందవచ్చని, రూటర్స్ వైఫై /హాట్‌స్పాట్ సేవలపై అనుమతి ఉండదని చెప్పింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.
మిలిటెంట్ల దాడులను నిరసిస్తూ సెప్టెంబర్ 10న విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనల్లో 80 మంది గాయపడ్డారు.దీంతో బీరేన్ సింగ్ ప్రభుత్వం అల్లర్లను కట్టడి చేసేందుకు, తప్పుడు కథనాలు, ఫేక్ సమాచారాన్ని అడ్డుకునేందుకు ఇంటర్నెట్ మీద నిషేధం విధించింది. కాగా, గతంలో మైతీ, కుకీ తెగల మధ్య రిజర్వేషన్ అంశంలో గొడవలు తలెత్తిన విషయం తెలిసిందే.