జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధికారులు హడావిడి చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో భారీగా ఇసుక మేటలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇసుక మేటలపై టోపోగ్రాఫికల్ శాండ్ సర్వే నిర్వహించారు ఓ ప్రైవేటు ఏజెన్సీ అధికారులు.

బ్యారేజ్ కు ఎగువన పేరుకుపోయిన ఇసుకతో పాటు 4,5,6 బ్లాకుల్లోని 18 గేట్లు, వెంట్ల వద్ద సర్వే నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ యాదగిరి,డీఈ రవీందర్ నేతృత్వంలో ఈ సర్వే జరిగినట్లు చెబుతున్నారు. లక్షల క్యూబీక్ మీటర్ల ఇసుక పేరుకుని ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై తెలంగాణ సర్కార్ కు నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది.