రేవ్‌ పార్టీలో తెలుగు నటులు.. నటి హేమ కూడా ఉన్నారు : బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌

-

బెంగళూరు నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీకి తెలుగు సినీ నటి హేమ హాజరైనట్లు బెంగళూరు పోలీసు కమిషనర్‌ దయానంద్‌ తెలిపారు. ‘నేను ఆ పార్టీకి హాజరు కాలేదు’ అంటూ ఆమె సోమవారం ఓ వీడియో విడుదల చేయడంతో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ‘రేవ్‌ పార్టీతో నాకేమీ సంబంధం లేదు. కావాలని నా పేరు ప్రచారం చేస్తున్నారు’ అని హేమ తప్పుడు ప్రచారానికి దిగారని కమిషనర్ అన్నారు. ఆమె ఆ కార్యక్రమానికి హాజరైనట్లు మీడియా సమావేశంలో సీపీ దయానంద్ ఆధారాలు విడుదల చేశారు.

హేమతో పాటు తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతల కుటుంబీకులు హాజరైనట్లు గుర్తించామని చెప్పారు. వారంతా మత్తు పదార్థాలు తీసుకున్నారో.. లేదో పరీక్షించడానికి రక్తనమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించామని .. అదుపులోకి తీసుకున్న 101 మందిలో ఐదుగురు మినహా మిగిలిన వారందరినీ పోలీసు ఠాణా జామీనుపై విడుదల చేశామని, పిలిస్తే విచారణకు హాజరు కావాలని సూచించామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news