నేడు ముంబయిలో భారత్ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు సభ

-

లోక్సభ ఎన్నికలకు నగారా మోగిన వేళ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. రానున్న ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కూడా ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతోంది. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఈసారి గద్దె దించాలన్న లక్ష్యంతో ఉన్న కూటమి ఆ దిశగా వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.

ఇవాళ రాహుల్‌ గాంధీ భారత్ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు కార్యక్రమంలో కూటమి అంతా ఒకే వేదికపైకి రాబోతోంది. ఈరోజు ముంబయిలో భారీ బహిరంగ సభకు ఇండియా కూటమి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేదికపైనే కూటమి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం చంపయి సొరెన్, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్, దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌, సీపీఐ, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన, ఎన్సీపీ నేతలు హాజరు కానున్నారు. ఈ వేదిక నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news