బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో నిర్వహించిన సభలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. మనం తెలుగు వాళ్లం.. మన హక్కుల కోసం అన్నదమ్ముల్లా కొట్లాడుదాం అన్నారు. ఢిల్లీ సుల్తాన్ లు వచ్చినా.. జాగీర్దార్లు వచ్చినా.. తెలుగు గడ్డ మీద ఇటుక కూడా తీయలేరు. విశాఖ ఉక్కును కదిలించలేరు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
పదేళ్లు అయినా పోలవరం పూర్తి కాలేదు. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి దాపురించింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు.ఉమ్మడి ఏపీలో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, వైఎస్ఆర్, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వంటి వారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఖ్యాతిని తీసుకొచ్చిన వారు అని పేర్కొన్నారు. ఢిల్లీని అడిగి సాధించే నాయకత్వం లేదన్నారు. కేవీపీ రాంచంద్రావు కాంగ్రెస్ సాక్షి.. ఎన్టీఆర్ ప్రభావంలో 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదని గుర్తు చేశారు.