‘భోలే బాబా’ ఆశ్రమంలోకి పురుషులకు నో ఎంట్రీ.. వెళ్లారో చితకబాదుడే!

-

ఉత్తర్ప్రదేశ్‌లోని హాథ్రస్‌ సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట తర్వాత భోలే బాబాకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజస్థాన్‌లోని ఆయన ఆశ్రమం గురించి పలు వివాదాస్పద అంశాలు బయటకు వచ్చాయి. ఖేడ్లీ పట్టణానికి సమీపంలోని సహజపుర్‌ గ్రామ శివారులో భోలే బాబా అలియాస్‌ నారాయణ్‌ సాకర్‌ హరి ఆశ్రమం ఉంది.

ఈ ఆశ్రమంలోని విషయాలు బయటకు తెలియకుండా ఆశ్రమం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు నిర్మించారు. భోలే బాబా ఆశ్రమంలో ఉన్న సమయంలో కేవలం మహిళా భక్తులకు మాత్రమే ఎంట్రీ ఉంటుందట. పురుషులకు ప్రవేశం ఉండదని ఆ ఊరి ప్రజలు తెలిపారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే బాబా అనుచరులు దాడులు చేసేవారని వాపోయారు. ఈ దాడులను ఆశ్రమ వాసులు బాబా దీవెనలుగా సమర్థించుకునేవారని ఆరోపించారు. పదేళ్ల క్రితం ఆశ్రమం కోసం గ్రామస్థుల భూమిని భోలే బాబా కొనుగోలు చేశారని స్థానిక పంచాయితీ వార్డు మెంబరు పూల్‌ సింగ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. బాబా అద్భుతాలు, అతీత శక్తుల గురించి ఆశ్రమ వాసులు చెప్పే మాటలను గ్రామస్థులెవరూ విశ్వసించేవారు కాదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news