గ్రూప్ పరీక్షలు వాయిదా… హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ దీక్షలు చేయాలని… వారి ప్రాణాలైనా పోవాలి, పరీక్షలైన వాయిదా పడాలి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్నగర్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యపై స్పందించారు.
గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్ వాళ్లు బ్రతుకుతారు.. ఒక్క నెల వాయిదా వేసిన ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కి 100 కోట్ల లాభం వస్తది… అందుకే కోచింగ్ సెంటర్ వాళ్లు కిరాయి మనుషులను పెట్టుకొని పరీక్షలు వాయిదా వేయాలని కావాలని ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.
గులాబీ పార్టీ కావాలనే… నిరుద్యోగులను రెచ్చగొడుతోందని… తమ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులకు నిత్యం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ అని… నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా తాము చూసుకుంటామని తెలిపారు. కానీ గులాబీ పార్టీ పాలనలో… నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. సరైన నోటిఫికేషన్లు ఇవ్వకుండా.. గతంలో కేసీఆర్ వేధించారని… ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే… నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.