బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ జూన్ 22వరకు పొడగింపు

-

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాక్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సహాయకుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని జూన్ 22 వరకు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు పొడిగించింది. శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కుమార్ ను మేజిస్ట్రేట్ ముందు హజరుపరుచగా, పోలీసుల తరపున న్యాయవాది అభ్యర్థన మేరకు కస్టడీని పొడిగించారు, కస్టడీ ముగిసిన తరువాత ఆయనను తిరిగి హాజరుపరచాలని ఢిల్లీ పోలీసులకు కోర్టు సూచించింది. అంతకుముందు శుక్రవారం, దర్యాప్తు అధికారి (ఐఓ) హాజరుకాలేదని గుర్తించిన కోర్టు కుమార్ కస్టడీని ఒక రోజు పొడిగించింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మే 13న కుమార్ తనపై దాడికి పాల్పడ్డారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మే 16 ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. అప్పటికే ఆయన ముందస్తు బెయిలు దరఖాస్తు చేయగా దాన్ని కోర్టు కొట్టి వేయడంతో మే 18న అరెస్ట్ చేశారు. తరువాత కుమార్ను కోర్టులో ప్రవేశపెట్టగా, ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. మే 24న, మరోసారి నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, ఆ తర్వాత మళ్లీ మూడు రోజులకు, తరువాత జూన్ 1న 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తాజాగా కస్టడీ గడువు ముగియడంతో మరికొద్ది రోజుల కస్టడీకి పోలీసులు కోరగా కోర్టు జూన్ 22 వరకు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 13 న కుమార్ మరొక బెయిల్ పిటిషన్ వేయగా, దానిన్ని కోర్టు కొట్టివేసింది. రెండు పిటిషన్లను కొట్టివేసిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Latest news