జమిలితో ప్రాంతీయ పార్టీలకు నష్టమా….!

-

జమిలి ఎన్నికలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. బీజేపీ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటోంది. ఇక కాంగ్రెస్ కూడా సై అంటోంది. వార క్రితం మోడీ ప్రభుత్వం… జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతికి పంపించింది. దీంతో 2026 లోపు దేశవ్యాప్తంగా జెమిలి ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ప్రాంతీయ పార్టీలు మాత్రం జమిలిపై కొంత వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి ఎన్నికల సంప్రదాయంతో మనుగడ కష్టమే అనే భావనలో లోకల్ పార్టీలు ఉన్నాయి. ఎంత వద్దనుకున్నా జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని ఆయా పార్టీల నేతలు అంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల భవిష్యత్తుపై అందరూ ఆందోళన పడుతున్నారు.

నిజంగానే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే… దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మనుగడ చాలా కష్టo అనే వాదన వినిపిస్తొంది. జెమినీ ఎన్నికలు జరిగితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే ఫైట్ ఉంటుంది.అప్పుడు ఎమ్మెల్యే,ఎంపీ పోలింగ్లో ఎక్కువ శాతం జాతీయ పార్టీలకు ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి.దీని వలన ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా నష్టపోవడమే అవుతుంది. అందుకే బీజేపీ నిర్ణయంపై ప్రాంతీయ పార్టీలు అసహనంగా ఉన్నాయి.

అంతేకాదు రాష్ట్రాల సమస్యలు పక్కకు జరిగి కేవలం జాతీయ సమస్యలు మాత్రమే తెరపైకి వస్తాయని ఆయా పార్టీలకు చెందిన నేతల భావన.వీళ్ళ ఆలోచనలు బట్టి చూస్తే కేంద్రంలో,రాష్ట్రంలో జాతీయ పార్టీలే అధికారంలో ఉంటే… ఆయా రాష్ట్రాలకు కచ్చితంగా నష్టమే జరుగుతుంది. స్థానిక సమస్యలు ఎవ్వరికీ పట్టవు. వాటిపై చర్చలు కూడా అంతంత మాత్రమే జరుగుతాయి.బీజేపీ పవర్ లో ఉన్న రాష్ట్రాల్లో ఇదే కనిపిస్తోంది.

జమిలి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు నష్టపోకుండా ఉండాలంటే జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా పొత్తు పెట్టుకుంటే జాతీయ పార్టీల హవానే కొనసాగుతుంది. ఇక ఇదంతా వద్దు అనుకుంటే… పార్టీలు నష్టపోయే విధానాలను పక్కన పెట్టాలంటే…. ప్రాంతీయ పార్టీలు బతికి బట్ట కట్టాలంటే అందరూ ఏకమై థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడాలి.ఒకవేళ అలా ఏర్పడితే థర్డ్ ఫ్రంట్ సక్సెస్ అవుతుందన్న నమ్మకాలు లేవు. ప్రాంతీయ పార్టీలు ఏకమైతే ఎవరో ఒకరి వలన గొడవలు వచ్చి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జమిలి ఎన్నికల నుంచి బయట పడాలంటే లోకల్ పార్టీలు ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version