‘భారతరత్న’ను బీజేపీ ఓ ఒప్పందంలా మార్చింది : తేజస్వియాదవ్‌

-

బీజేపీపై ఆర్జేడీ అగ్రనేత, బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ను బీజేపీ ఒక ఒప్పందంలా మార్చిందని మండిపడ్డారు. ‘మీరు మాతో మేం కోరిన ఒప్పందం చేసుకుంటే.. మేం మీకు భారత రత్న ఇస్తాం’ అన్నట్లుగా బీజేపీ తీరు ఉన్నదని ఆయన దుయ్యబట్టారు. సీఎం నితీశ్‌ ఎన్డీఏలో కలిసినందుకు జేడీయూ నాయకుడి తండ్రి అయిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్‌కు బీజేపీ సర్కారు ‘భారత రత్న’ ప్రకటించిందని ఆరోపించారు.

‘బీహారి అయిన కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న పురస్కారం దక్కడంపై నేను సంతోషంగా ఉన్నా. కానీ బీజేపీ సర్కారు భారత రత్నను ఒక ఒప్పందంలా మార్చేసింది. మీరు మాతో డీల్‌ కుదుర్చుకుంటే మేం మీకు భారత రత్న ఇస్తాం అన్నట్లు వ్యవహరిస్తోంది’ అని అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తేజస్వి యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన ఫ్లోర్‌ టెస్టులో నితీశ్‌ కుమార్‌ సర్కారు బలం నిరూపించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version