BREAKING : వారణాసి ఎంపీ అభ్యర్థిగా మోదీ నామినేషన్

-

ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. వారణాసిలోని కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి మోదీ నామపత్రాలు సమర్పించారు. భారీ బందోబస్తు మధ్య ఆయన కలెక్టరేట్కు చేరుకున్నారు. మోదీ వెంట పలువురు ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉన్నారు. వరుసగామూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా మోదీ వారణాసి బరిలో దిగుతున్నారు. నామినేషన్ సందర్భంగా మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేథ్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగానదికి హారతి సమర్పించిన అనంతరం…. పర్యాటక బోటులో గంగానదీ విహారం చేశారు. ఆ తర్వాత కాలభైరవుడి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అంతకుముందు మోదీ వారణాసి ప్రజలను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. కాశీ నగరంపై తనకున్న ప్రేమ, గంగానదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చిందని ఈ వీడియోలో మోదీ వెల్లడించారు. ‘‘2014లో నేను కాశీకి వచ్చినప్పుడు.. గంగమ్మ(నది) నన్ను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించింది. ఈ పదేళ్ల కాలం తర్వాత.. ఆ గంగమ్మ నన్ను దత్తత తీసుకుందని చెప్పగలను. ఈ సమయంలో కాశీతో నా బంధం దృఢంగా మారింది. ఇప్పుడు ఈ ప్రాంతం నాది. ఒక తల్లి, కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నాను’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news