బ్రేకింగ్:రాజస్థాన్ లో ఘోర పడవ ప్రమాదం…!

రాజస్థాన్ లో నేడు ఉదయం ఘోర పడవ ప్రమాదం జరిగింది. కోట జిల్లాలోని చంబా నదిలో పడవ నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 20 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాద ఘటన సమయంలో పడవలో మొత్తం 50 మంది ఉన్నారని అక్కడి స్థానిక పోలీసు అధికారులు జాతీయ మీడియాకు వెల్లడించారు. మిగిలిన 27 మందిని స్థానికులు కాపాడారని మిగిలిన వారు నదిలో గల్లంతయ్యారని పోలీసులు చెప్పారు.

నది ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయ చర్యలు కాస్త కష్టంగా మారాయని అక్కడి పోలీసులు మీడియాకు తెలిపారు. వీరందరూ నది దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బాధితులను కాపాడటానికి గాను గజ ఈతగాళ్లను పోలీసు అధికారులు రంగంలోకి దింపారు.