బ్రేకింగ్: సోను సూద్ కు షాక్ ఇచ్చిన బొంబాయి హైకోర్ట్

-

నటుడు సోను సూద్ కి బోంబే హైకోర్ట్ ఊహించని షాక్ ఇచ్చింది. ముంబైలోని జుహు ప్రాంతంలోని తన నివాస భవనంలో అక్రమ నిర్మాణాలు జరిగాయని బిఎమ్‌సి నోటీసు ఇవ్వగా బొంబాయి హైకోర్ట్ కి వెళ్లి సోను సూద్ పిటీషన్ దాఖలు చేసాడు. ఈ నేపధ్యంలో సోను సూద్‌ కు ఉపశమనం ఇవ్వడానికి బొంబాయి హైకోర్టు నిరాకరించింది. సోను సూద్ పిటీషన్ ను కొట్టివేస్తూ, జస్టిస్ చవాన్… “బంతి ఇప్పుడు బీ ఎం సి కార్యాలయంలో ఉంది” అని అన్నారు.

సోను సూద్ న్యాయవాది అమోగ్ సింగ్ ఆదేశాలను పాటించటానికి కనీసం 10 వారాల సమయం కోరగా… జస్టిస్ చవాన్ మాట్లాడుతూ, “మీరు చాలా ఆలస్యం చేసారు. మీకు తగినంత అవకాశం ఉందని చట్టం మీద శ్రద్ధ ఉన్న వారికే చట్టం సహాయం చేస్తుంది అన్నారు. సోను సూద్ భవనం శక్తి సాగర్ ను బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) కూల్చివేయడానికి రెడీ అయింది.

ఉపశమనం కోసం సోను సూద్ దిందోషి సివిల్ కోర్టుకు వెళ్ళగా అక్కడ పిటీషన్ కొట్టేసారు. ఆ తర్వాత సోను సూద్ మరియు అతని భార్య సోనాలి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా… సోను సూద్ యొక్క న్యాయవాది అమోగ్ సింగ్ వాదించారు, ” బీ ఎం సి పంపిన నోటీసులో, చట్టవిరుద్ధమైన నిర్మాణం ఉందని, దాని గురించి ప్రస్తావించలేదు అని అన్నారు. 1992 నుండి భవనం ఉంది అని పేర్కొన్నారు. నోటీసు నిర్దిష్టంగా ఉండాలి అనేది తమ వాదన అన్నారు. జుహులోని ఆరు అంతస్తుల రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ ను హోటల్‌ గా మార్చగా… 2018 లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సోను సూద్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news