పోర్న్ వీడియోస్ చూసి తల్లి కళ్లముందే సొంత చెల్లిపై రేప్.. ఆపై గొంతు నులిమి హత్య

-

మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోర్న్ వీడియోలు చూసి 13 ఏళ్ల బాలుడు, తొమ్మిదేళ్ల తన సొంత చెల్లెలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చెల్లెలిని తన తల్లి ఎదుటే గొంతు నులిమి హత్య చేశాడు. ఇదంతా చూసిన తల్లి కుమారుడిని అడ్డుకోకుండా సహకరించింది. బాధితురాలి మృతదేహాన్ని మరో కుమార్తెతో కలిసి ఇంటిబయట పడేసి ఇంటి ప్రాంగణంలో తమ కుమార్తె మృతదేహం పడి ఉందంటూ ఏప్రిల్ 24న ఉదయం పోలీసులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు.

మూడు నెలల క్రితం (ఏప్రిల్ 23న రాత్రి) జరిగిన ఈ ఘటనలో బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన వాంగ్మూలంపై పోలీసులకు సందేహం రావడంతో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. తాను చేసిన అఘాయిత్యం గురించి తండ్రికి చెబుతానని బెదిరించడంతో అతడు తన చెల్లిని గొంతునులిమి హత్య చేశాడని ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. దర్యాప్తు సమయంలో ఆధారాలు సేకరించి 50 మందిని విచారించగా.. కుటుంబ సభ్యుల వాంగ్మూలాల్లో పదేపదే మార్పులు ఉండటాన్ని గుర్తించి వాటి ఆధారంగానే అసలు విషయాన్ని తెలుసుకోగలిగినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version