గ్లోబల్ వైడ్‌గా వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. రెండ్రోజుల వ్యవధిలోనే రెండు ఘోర విమాన ప్రమాదాలు జరిగాయి. అందులో ఒకటి కజకిస్థాన్, సౌత్ కొరియాలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం సౌత్ కొరియాలో సంభవించిన విమాన ప్రమాదంలో సుమారు 175 మందికి పైగా ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది.
మొన్న జరిగిన కజకిస్తాన్ విమాన ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా ప్యాసింజర్స్ తమ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికే రెండు విమాన ప్రమాదాలు మరవకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. హలిఫాక్స్ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం విరిగిన ల్యాండింగ్ గేర్‌తో ల్యాండ్ అయింది. ఆ వెంటనే పెద్దఎత్తున విమానం కింది భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.చివరకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కజకిస్థాన్, సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదాలు మరవకముందే మరో ప్రమాదం. హలిఫాక్స్ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం విరిగిన ల్యాండింగ్ గేర్ తో ల్యాండ్ అయింది. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు పెద్ద ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. pic.twitter.com/hpRkOOAtZO
— ChotaNews App (@ChotaNewsApp) December 29, 2024