ఉత్తర భారత్ లోని పలు రాష్ట్రాలలో భూకంపం వచ్చింది. ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, మణిపూర్, చండీగఢ్ తో పాటు ఉత్తర భారత్ లోని పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పది సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇల్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఢిల్లీలో రిక్టర్ స్కేల్ పై భూకంపతీవ్రత 4.0 గా నమోదు కాగా.. జమ్మూ కాశ్మీర్ లో 5.7 గా నమోదయింది. ఒక్కసారిగా భవనాలు కదలడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.