తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి కస్టోడియల్ డెత్ విచారణ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మరణాలకు సంబంధించి అరెస్ట్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ పల్తురై నిన్న రాత్రి కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. టుటికోరిన్లో తండ్రి కొడుకులు జయరాజ్, బెన్నిక్స్ కస్టడీ మరణాలకు సంబంధించి అరెస్టయిన 10 మంది నిందితులను మదురై సెంట్రల్ జైలులో ఉంచారు అధికారులు.
ఈ కేసుని సిబిఐ విచారిస్తుంది. తండ్రి కొడుకుల మరణంపై తమిళ నాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వారిని కొట్టి చంపేశారు అనే విమర్శలు వచ్చాయి. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణను కోరింది. ఇది రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించిన సంగతి తెలిసిందే. విపక్ష డిఎంకె అయితే అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. రోడ్లపై డిఎంకె ఆధ్వర్యంలో నిరసనలు కూడా జరిగాయి.