సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ఆర్మీ అభ్యర్థులు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న బస్సులపై రాళ్లు రువ్వారు. అద్దాలను ధ్వంసం చేశారు.రాళ్లతో రైలు పై దాడి చేస్తూ నానా హంగామా సృష్టించారు.రాళ్లు రువ్వడంతో భయబ్రాంతులకు గురి అయిన ప్రయాణికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారు.దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ పై ఆందోళనలు చెలరేగుతున్నాయి.
కాగా అగ్నిపథ్ ఆందోళనలపై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పండే స్పందించారు. త్వరలోనే రిక్రూట్మెంట్ షెడ్యుల్ ప్రకటిస్తామని తెలిపారు.కరోనా వల్ల రెండేళ్ల నుంచి రిక్రూట్మెంట్లు జరపలేదని తెలిపారు. అగ్నిపధ్ స్కీమ్ లో 2022 నియామకాలకు సంబంధించి ఇప్పటికే గరిష్ట వయస్సు పరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచామని చెప్పారు. ఇండియన్ ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనుకునేవారు అగ్ని వీర్లుగా అవకాశం దక్కించుకోవాలని చెప్పారు.